అలంపూర్ ఆలయాలు బంద్
GDWL: చంద్రగ్రహణం సందర్భంగా అలంపూరులోని శ్రీ జోగులాంబ అమ్మవారు, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మార్చి 3న మూసివేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి దర్శనాలు, చండీ హోమాలు నిలిపివేస్తామని అర్చకులు తెలిపారు. గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి నిర్వహించి, బుధవారం ఉదయం 9 గంటల నుంచి భక్తులకు తిరిగి దర్శనం కల్పిస్తారు.