కలెక్టరేట్‌లో నేడు ప్రజా సమస్యల వేదిక

కలెక్టరేట్‌లో నేడు ప్రజా సమస్యల వేదిక

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో ఇవాళ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం మాత్రమే కాకుండా డివిజన్, మండల, మున్సిపాలిటీలలోనూ సంబంధిత అధికారులు పాల్గొని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించేలా అవకాశం కల్పించనున్నారని ఆయన వివరించారు.