పొంగిన హంద్రీ నది.. బ్రిడ్జి పైనుంచి పారుతున్న నీరు

KRNL: కల్లూరులో ఉన్న హంద్రీ బ్రిడ్జిపైకి వర్షపు నీరు పొంగి పారుతోంది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కల్లూరు నుంచి దేవనగర్ వైపు ఉన్న హంద్రీ నది ఉద్ధృతం దాల్చింది. ఆదివారం ఉదయం నుంచి క్రమంగా నీరు పెరుగుతూ.. బ్రిడ్జి పైకి ఎక్కి పారింది. ప్రమాదం పొంచి ఉందని, పాదచారులు, వాహనదారులు అటువైపుగా రావొద్దని స్థానికులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు.