VIDEO: లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా పల్లకి సేవ
ప్రకాశం: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం నరసింహ స్వామి వారికి పల్లకి సేవా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు చోడా వీరభద్రస్వామి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.