మిమ్స్ ఉద్యోగుల అరెస్ట్‌పై నిరసన

విజయనగరం: మిమ్స్ ఉద్యోగుల అక్రమ అరెస్టులను ఖండించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు అన్నారు. బుధవారం బొబ్బిలిలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పరిష్కారం చేయమని గత 62 రోజులుగా మిమ్స్ ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు. వారి సమస్యలు పరిష్కారం చేయడం లేదని అడిగినందుకు, పోలీసులతో అరెస్టులు చేయించి అక్రమ కేసులు పెట్టించడం సరికాదని అన్నారు.