పీ4, సంజీవిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి: సీఎం
CTR: కుప్పం నేతలతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు పీ4, సంజీవిని కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని నేతలకు పిలుపునిచ్చారు. కుప్పం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీని కలిసికట్టుగా బలోపేతం చేయాలని అన్నారు.