గుత్తిలో వామపక్షాల ఆధ్వర్యంలో గ్రామీణ బంద్

ATP: గుత్తిలో వామపక్షాలు సీఐటీయూ, సీపీఎం, సీపీఐ, ఏఐటియుసి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామీణ బంద్ నిర్వహించారు. సీపీఐ నాయకులు రామదాసు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా మోసగిస్తుందని, వెంటనే రైతులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.