VIDEO: 'సీఎం ఇంటిపై దాడి హేయమైన చర్య'
KMR: రామారెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకులు CM రేవంత్ రెడ్డి ఇంటిపై, దాడికి యత్నించడం హేయమైన చర్య అని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మండలంలోని పోసానిపేట గ్రామ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ నాయకుల ఆగడాలు పెరిగిపోయాయని, CM ఇంటిపై దాడికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.