వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై

వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై

BPT: కర్లపాలెంలో పోలీసులు బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్థానిక హెచ్.జె.బి (HJB) డిగ్రీ కళాశాల సమీపంలో ఎస్సై రవీంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. లైసెన్స్, ఇన్సూరెన్స్, హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు.