వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు

NRPT: జిల్లా కేంద్రంలోని యాదగిరి రోడ్డులో శనివారం SI వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, నంబర్ ప్లేట్లను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు రూ.23,500 జరిమానా విధించారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, సీట్ బెల్ట్ ధరించాలని SI తెలిపారు.