గంజాయి నివారణకు పోలీసుల ప్రత్యేక తనిఖీలు
ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో గంజాయి నివారణ లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్ విభాగపు శిక్షణ పొందిన జాగిలం రోమా సహాయంతో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఇతర రద్దీ ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలు చట్టరీత్యా తీవ్రమైన నేరమని హెచ్చరించారు.