'ఎన్నికల కేంద్రంలోకి ఫోన్ అనుమతి లేదు'

కృష్ణా: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రంలోకి సెల్ ఫోన్‌ల అనుమతి లేదని సింగ్ నగర్ ఎస్సై రమ్యశ్రీ తెలిపారు. గురువారం సింగ్ నగర్ ఎంకే బేగ్ మున్సిపల్ హైస్కూల్‌లో పోలింగ్ కేంద్రంలోనికి ఫోన్లు అనుమతించబడవని ఓటర్లకు తెలియజేశారు. ఉదయం 8 గంటలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల సాగుతున్నాయని తెలిపారు.