రాజధాని నిర్మాణ పనులపై సీఎం సమీక్ష
AP: రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి మంత్రి నారాయణ, CRDA, ఏడీసీ ఉన్నతాధికారులు, రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన, రద్దు చేసిన పనులపై సీఎం చర్చించారు. ఏ నిర్మా సంస్థ ఎంతమేర పనులు చేసిందనే విషయంలో సమీక్షించారు. వారం, నెల లక్ష్యంగా పెట్టుకుని పనులు పూర్తి చేయాలని అన్నారు.