VIDEO: అగ్నిపర్వతం పేలితే ఎలా ఉంటుందంటే?
పశ్చిమ జపాన్ ద్వీపం క్యుషులో సకురాజిమా అగ్నిపర్వతం పేలింది. ఈ పేలుళ్లు చాలా శక్తివంతంగా ఉండటంతో ఆకాశంలో లావా, బూడిద 4.4 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిపడింది. జపాన్ కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:57 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. భారీ పేలుడు కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలుస్తోంది.