యుద్ధం ఎఫెక్ట్.. మధ్యాహ్న భోజనంపై ప్రభావం

యుద్ధం ఎఫెక్ట్.. మధ్యాహ్న భోజనంపై ప్రభావం

HYD: పశ్చిమాసియాలో యుద్ధం నగరంలోని ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజనంపై ప్రభావం చూపుతోంది. ఈ నెల ఒకటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం సరఫరా చేసే ఏజెన్సీలకు వంటగ్యాస్ సెగ తగిలింది. దీంతో విద్యార్థుల భోజనంలో కూరలు, పప్పు తగ్గిపోయి.. అన్నం, సాంబారు మాత్రమే ఉంటోంది. కూరలకు బదులుగా చట్నీ ఇవ్వడం ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం గుడ్డు, శనివారం బగారా రైస్ ఇస్తున్నారు.