నేడు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్
బాపట్ల జిల్లాలో చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ల పరిధిలో నేడు జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలకు 2,412 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్వహణకు ఫ్లయింగ్ స్క్వాడ్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ అధికారులు, కస్టోడియళ్లను నియమించాలన్నారు. ఉదయం 10-1 గంట వరకు ఈ ఎగ్జామ్ జరుగుతుందన్నారు.