రెవెన్యూ అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
VZM: జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న దేవాలయాలు, ఏడాదిలో జరిగే ఉత్సవాల వివరాలు అందివ్వాలని అధికారులకు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో శనివారం ఆయన స్పందించారు. ఆయా ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల సంఖ్య, గతంలో జరిగిన దుర్ఘటనలు, తదితర అంశాలతో సర్వే చేసి నివేదిక అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.