'చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అమలు చేయాలి'
సత్యసాయి: చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అమలు చేయాలని చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు శీలా నారాయణస్వామి కోరారు. ఈ మేరకు సోమవారం పెనుకొండ రెవెన్యూ డివిజన్ అధికారి ఆనంద బాబుకి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుడికి ప్రతి సంవత్సరానికి పెట్టుబడి సాయంగా రూ. 25వేలు జమ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు. అయితే, ఇప్పటికీ జమచేయపోవడం సిగ్గు చేటన్నారు.