VIDEO: మొదలైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

CTR: పుంగనూరు కోనేటిపాళ్యం సమీపానగల శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. శ్రీ వైఖానస ఆగమ శాస్త్ర రీత్యా వేద పండితులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. నేడు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు టీటీడీ పర్యవేక్షణలో జరుగుతున్నాయి.