VIDEO: మానవత్వం చాటుకున్న ఖాకీ యూనిఫామ్
MHBD: చెరువులో పడి మృతి చెందిన సారయ్య మృతదేహాన్ని బయటకు తీయడానికి బంధువులు ముందుకు రాకపోవడంతో గంగారాం SI రవికుమార్ స్వయంగా రంగంలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీశారు. రక్త బంధం కన్నా ఖాకీ బంధం గొప్పదని నిరూపించిన ఈ సంఘటన గ్రామస్థులను కన్నీరు కార్చించింది. 'ప్రాణం పోయాక బంధుత్వమెక్కడ' అని ప్రశ్నించిన ఎస్సై చేతలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చాయి.