నులిపురుగుల నిర్మూలనపై ఆరోగ్య కేంద్రంలో సమీక్ష
NLR: వలేటివారిపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై మండల స్థాయి సమన్వయ సమావేశం సోమవారం నిర్వహించారు. డా. శివప్ప అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ నెల 24న నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు మాత్రలు పంపిణీ చేయాలని అధికారులు సూచించారు.