VIDEO: విశాఖలో అగ్నిప్రమాదం
VSP: గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెం ప్రాంతంలోని రాజభోగం హోటల్ టిఫిన్ సెంటర్‌లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి హోటల్ పైకప్పు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా వెలిగించిన తారాజువ్వ పైకప్పుపై పడింది.