కెప్టెన్‌గా తప్పుకున్న అజింక్య రహానే

కెప్టెన్‌గా తప్పుకున్న అజింక్య రహానే

టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. యువ ఆటగాళ్లకు కెప్టెన్‌గా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే రహానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అతడు ప్లేయర్‌గా మాత్రం కొనసాగనున్నాడు.