VIDEO: రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NRML: భైంసా పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు మంజూరైన వ్యవసాయ పరికరాలను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పంపిణీ చేశారు. లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను అందజేశారు. భైంసా, కుంటాల, కుభీర్ మండలాలకు చెందిన పలు గ్రామాల రైతులకు స్ప్రే పంపులు, రోటవేటర్లు, తదితర ఆధునిక వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు.