డుంబ్రిగుడ పీహెచ్సీకి అంబులెన్స్ లేక ఇబ్బందులు
ASR: డుంబ్రిగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ నాలుగు నెలలుగా మరమ్మతుల కారణంగా అందుబాటులో లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐటీడీఏ అందించిన అంబులెన్స్ పాడై పాడేరు షెడ్డులో ఉంది. స్థానిక పీహెచ్సీకి కొత్త అంబులెన్స్ మంజూరుకానందున రోగులు, ముఖ్యంగా గర్భిణులు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది.