నేడు భీమవరం పోలీస్ స్టేషన్లో 'PGRS' కార్యక్రమం
W.G: భీమవరం పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' ను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జరుగుతుందని అన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.