వాడరేవు క్రాస్ వద్ద శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమం
BPT: హెల్మెట్ ధారణ ఆవశ్యకతను వివరిస్తూ చీరాల టూ టౌన్ సీఐ అశోక్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు బుధవారం ఉదయం దిగమర్రు జాతీయ రహదారిపై వాడరేవు క్రాస్ వద్ద శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు వారు స్వీట్లు పంచారు. హెల్మెట్ లేని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. గురువారం నుంచి హెల్మెట్ తప్పనిసరి అని సూచించారు.