VIDEO: పాఠశాలల్లో గణపతి సంబరాలు.. SUPER

MDCL: ఉప్పల్, నాచారం, చిల్కానగర్, మల్లాపూర్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మంగళవారం ముందస్తు గణపతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులకు గణపతి రూపాన్ని వేషంగా వేసి, ఆటపాటలతో చిందులేస్తూ సంబరంగా గడిపారు. అనంతరం బొజ్జ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, చదువుల్లో రాణించాలని విద్యార్థులు గణపతిని కోరారు. ముఖ్యంగా పిల్లల వేషధారణ ఆకట్టుకుంది.