తలసేమియా అవగాహన కరపత్రాలు ఆవిష్కరణ
KMR: తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఐవీఎఫ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ రాజమౌళి గుప్త అన్నారు. ముషిరాబాద్‌లోని ఆయన నివాసంలో తలసేమియా అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. తలసేమియా చిన్నారుల కోసం మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఛైర్మన్ బాలు ఉన్నారు.