జాతీయ రహదారిపై లారీ బోల్తా

జాతీయ రహదారిపై లారీ బోల్తా

కోనసీమ: ఐ.పోలవరం మండలం కొమరగిరి సమీపంలో 216 జాతీయ రహదారిపై ఓ లారీ బోల్తా పడింది. శుక్రవారం తెల్లవారుజామున ఆకివీడు నుంచి కలకత్తా వెళ్తున్న లారీ అదుపుతప్పి రహదారి పక్కనే బోల్తా పడింది. ఘటన సమయంలో రోడ్డుపై జనసంచారం లేకపోవడం వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాద ఘటనలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.