ఆసుపత్రి స్థల సేకరణపై తహసీల్దార్‌తో సాధన సమితి చర్చలు
WGL: వరదన్నపేట పట్టణ కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. శనివారం వర్ధన్నపేట సాధన సమితి సభ్యులు తహసీల్దార్ విజయ్ సాగర్‌ను కలిసి చర్చించారు. పట్టణానికి సులభంగా చేరుకునేలా, రోగులకు మెరుగైన రవాణా సౌకర్యాలు ఉండే ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరారు.