వడదెబ్బతో మహిళ మృతి

HNK: వడదెబ్బతో మహిళ మృతి చెందిన ఘటన ఐనవోలు మండలంలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. నందనంకు చెందిన యాకర మల్లమ్మ కొన్ని రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో వడదెబ్బ తగిలింది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి బుధవారం మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.