'జిల్లాలో గ్యాస్ సిలిండర్లపై ఆందోళన వద్దు'
BPT: జిల్లాలో గ్యాస్ కొరత లేదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జమీర్ బాషా పేర్కొన్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. జిల్లాలో 5,377 గ్యాస్ సిలెండర్లు అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందవద్దన్నారు. సిలెండర్లు బరువు తగ్గిన, అధిక ధరలకు విక్రయించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.