స్కూల్ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
NGKL: లింగాల మండలం మాడాపూర్ గ్రామంలో 30 లక్షల రూపాయలతో నూతనంగా స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి ఇవాళ ఎమ్మెల్యే వంశీకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈ కొత్త స్కూల్ భవనం నిర్మాణం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.