సినీ కార్మికుల సమ్మెకు తెర

సినీ కార్మికుల సమ్మెకు తెర

HYD: గడిచిన 18 రోజులుగా సినీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెరపడింది. 30 శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు AUG 4 నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో సినిమాలు, సీరియళ్ల షూటింగులు నిలిచిపోయాయి. FDC ఛైర్మన్ దిల్ రాజు చొరవతో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో 22.5 శాతం వేతనాలు పెంచినట్లు తెలుస్తోంది. దీంతో రేపటి నుంచి షూటింగ్స్ యథావిధిగా ప్రారంభం కానున్నాయి.