'ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి'

NLG: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులను గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు అన్నారు. “పనుల జాతర” లో భాగంగా శుక్రవారం మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభ, పనుల జాతరలో ఆయన పాల్గొని మాట్లాడారు.