గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
RR: యాచారం మండలం తులేకుర్దులో విషాదం నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని వారు భావిస్తున్నారు. కాగా, హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.