త్వరలో టీవీ రంగానికి అవార్డులు: మంత్రి
TG: త్వరలో టీవీ రంగానికి కూడా అవార్డులు ప్రకటిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. చిత్రపురి సమస్యను పరిష్కరిస్తామని, చిన్ననటులకూ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సినీ కార్మికులు, టీవీ రంగం నటీనటులు, టెక్నికల్ నిపుణులు అందరికీ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. వారికి ఎలాంటి సమస్య వచ్చినా ఆయన దగ్గరికి రావచ్చని స్పష్టం చేశారు.