VIDEO: అదనపు కట్నం డిమాండ్‌తో పెళ్లికొడుకు పరార్

VIDEO: అదనపు కట్నం డిమాండ్‌తో పెళ్లికొడుకు పరార్

HNK: కమలాపూర్ మండలం ఉప్పల్‌లో అదనపు కట్నం డిమాండ్ కారణంగా పెళ్లికొడుకు పరారైన ఘటన చోటుచేసుకుంది. మార్చి 6న జరగాల్సిన వివాహానికి రెండు రోజుల ముందే వరుడు కనిపించకుండా పోయినట్లు పెళ్లి కూతురు తండ్రి పొన్నాల రాజయ్య తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు మంగళవారం పురుగుల మందు డబ్బాతో అబ్బాయి ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.