పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా పొన్నూరులోని దండమూడిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, కూటమి ప్రభుత్వం పారదర్శకంగా రీ సర్వే చేసి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిందని పేర్కొన్నారు.