నంద్యాల కోర్టులో 13న మెగా లోక్ అదాలత్

నంద్యాల కోర్టులో 13న మెగా లోక్ అదాలత్

నంద్యాల జిల్లా కోర్టులో ఈనెల 13వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ తంగమని తెలిపారు. రాజీమార్గమే రాజ మార్గమని పేర్కొంటూ, రాజీ అయ్యే సివిల్, ఇన్సూరెన్స్ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని ఆమె కోరారు. న్యాయవాదులు తమ క్లయింట్లకు లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించి, సహకరించాలని జడ్జ్ సూచించారు.