ఉప్పల్ పిస్తా హౌస్ వద్ద ట్రాఫిక్ జామ్..!
MDCL: ఉప్పల్ పిస్తా హౌస్ వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా ఉప్పల్ నుంచి నాగోల్, హబ్సిగూడ వైపు వెళ్లే మార్గంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలన్నారు.