గని నీటితో పంటల నష్టం.. రైతుల ఆందోళన

గని నీటితో పంటల నష్టం.. రైతుల ఆందోళన

BHPL: మల్హర్ రావు మండలం తాడిచెర్లలోని ఉపరితల గని బ్లాక్-1 ప్రాజెక్ట్ నుంచి ప్రైవేటు సంస్థ విడుదల చేస్తున్న నీటితో పంట పొలాలు నాశనమవుతున్నాయని, కాపురం గ్రామ శివారు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నీరు కాలువల ద్వారా పొలాల్లోకి చేరి బురద పేరుకోవడంతో నష్టం వాటిల్లుతోందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి పరిష్కరించాలని ఇవాళ కోరారు.