VIDEO: ఇంటి గేటును ఢీకొన్న బొలెరో వాహనం
MHBD: కురవి మండలం బలపాల గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. MHBD నుంచి డోర్నకల్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి ఆ గ్రామస్థుడు కనకయ్య ఇంటి గేటును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం సేవించడం వల్లనే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు ఆరోపించారు.