కుక్క వల్ల కాదు.. గుండెపోటుతో మృతి

HYD: మధురానగర్ PS పరిధిలో ఆదివారం దాసరి పవన్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క దాడి చేయడంతో మృతి చెందాడని వచ్చిన వార్తలు అవాస్తవమని సీఐ మహమ్మద్ షాకిర్ అలీ తెలిపారు. మృతుడు శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా అతడు ఆదివారం గుండెపోటు రావడంతోనే మృతి చెందినట్లు పోస్టుమార్టంలో విషయం వెల్లడైందన్నారు. యజమాని పడిపోగానే శునకం లేపేందుకు యత్నించగా మర్మాంగాలపై రక్కింది.