నిర్మల సీతారామన్ రేపటి పర్యటనకు సమగ్ర భద్రతా ఏర్పాట్లు
GNTR: తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేలపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 జాతీయ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణ భూమి శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ భద్రతా ఏర్పాట్లను గురువారం పరిశీలించారు.