కోతుల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు

కోతుల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు

NLG: కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం గ్రామంలో కోతుల గుంపు దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. తన ఇంటి ప్రాంగణంలో పనులు చేసుకుంటుండగా కోతులు ఆమెపై విరుచుకుపడ్డాయి. దీంతో ఆమె తప్పించుకునే లోపే కోతులు ఆమెను తీవ్రంగా గాయపరిచి, ఒంటినిండా రక్తస్రావం అయ్యేలా చేశాయి. బాధితురాలిని చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.