రోడ్డు ప్రమాదం... ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం... ఇద్దరికి తీవ్ర గాయాలు

E.G: విజ్జేశ్వరం గోదావరి గట్టు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ మోటార్ సైకిల్ నియంత్రణ కోల్పోయి రహదారి పక్కనే ఉన్న అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డును ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.