పొంగుటూరులో ట్రాన్స్ ఫార్మర్ల చోరీ
ELR: కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామంలో రైతులు పసుపులేటి దుర్గారావు, రాజేంద్రప్రసాద్ పొలాల్లోని ట్రాన్స్ ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేసి, వాటిలోని విలువైన కాపర్ వైరును చోరీ చేశారు. పొంగుటూరు పరిసర ప్రాంతాల్లో కాపర్ వైర్లను దొంగిలించే ముఠా తయారయిందని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.