సర్దార్ సర్వయ్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

మేడ్చల్: హబ్సిగూడ డివిజన్ వెంకట్ రెడ్డి నగర్ బస్టాండ్‌లో శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉప్పల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘ నాయకులు మల్లేష్ గౌడ్, శంకరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్వయ్ పాపన్న పోరాట జీవితం మనందరికీ ఆదర్శమని నాయకులు తెలిపారు.